Mokshagna Debut: మోక్షజ్ఞ సినిమాకు పాన్ ఇండియా డైరెక్టర్!..బాలయ్య కూతురు కూడా సినిమాల్లోకి!!

నటరత్న నందమూరి మోక్షజ్ఞ సినిమాను బాలయ్య చిన్నకూతురు తేజస్విని నిర్మించనుందని తెలుస్తోంది.మోక్షజ్ఞ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యేందుకు కావలసిన యాక్టింగ్ స్కిల్స్,డాన్స్,ఫైట్స్ లాంటివి నేర్చుకున్నాడు.మోక్షజ్ఞ హీరోగా నటించబోయే చాలామంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి.బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందనే టాక్ నడిచింది.అనిల్ రావిపూడి పేరు కూడా వినిపించింది.అయితే ఇప్పుడు యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు తెరపైకి వచ్చింది.

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు.రణవీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరో మూవీ చేయాలని భావించాడు.అయితే ఇది ఎందుకనో సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయింది.ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకి బాలకృష్ణ అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రశాంత్ వర్మ కూడా మోక్షజ్ఞతో పవర్ ఫుల్ సూపర్ హీరో స్టోరీ చేయాలని రెడీ అవుతున్నాడంట.ఈ సినిమాని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మించే అవకాశం ఉందంటున్నారు.త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.మోక్షజ్ఞ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో తన ఇంట్రడక్షన్ గురించి కన్ఫర్మ్ చేశాడు.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ చేస్తే కచ్చితంగా అది బ్లాక్ బాస్టర్ అవుతుందని బాలయ్య అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు.