![ట్రెడిషనల్ డ్రెస్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్య](https://static.v6velugu.com/uploads/2023/03/ballayyya_7bpcigW9Sz.jpg)
తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా టాలీవుడ్‌లో కొత్త సినిమాల అప్డేట్స్, సరికొత్త పోస్టర్స్‌తో సందడి వాతావరణం కనిపించింది. దీనిలో భాగంగానే బాలకృష్ణ ఆయన సరికొత్త లుక్‌తో సర్‌ప్రైజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ మూవీ నుంచి ఉగాది సందర్భంగా బాలయ్య ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ట్రెడిషనల్ డ్రెస్‌లో, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు బాలకృష్ణ. ‘మీరు ఎన్ని ఊహించుకున్నా అంతకుమించేలా ఈ సినిమా ఉంటుంది’ అని ఫస్ట్ లుక్ పోస్టర్‌పై రాసుండటం సినిమాపై అంచనాలు పెంచుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపించనుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.