ముత్తిరెడ్డికి టికెట్‌‌‌‌‌‌‌‌ ఇస్తే గెలిపించుకుంటం: బాల్దె సిద్దిలింగం

జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యే టికెట్‌‌‌‌‌‌‌‌ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇస్తే గెలిపించుకుంటామని మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బాల్దె సిద్దిలింగం అన్నారు. జనగామలోని ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కువగా లబ్ధి పొంది, పదవులు అనుభవించిన లీడర్లే ముత్తిరెడ్డి గొంతుకోసేలా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. ఇలాంటి వారితో భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో పల్లాకు కూడా నష్టమేనన్నారు.

ఒకరిద్దరు లీడర్లు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదని జనాలు ముత్తిరెడ్డి వెంటే ఉన్నారన్నారు. అనంతరం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని చర్లపల్లిలోని నోమా గార్డెన్స్‌‌‌‌‌‌‌‌కు బయలుదేరారు. సమావేశంలో పసుల ఏబేలు, వంగ ప్రణీత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వాంకుడోత్‌‌‌‌‌‌‌‌ అనిత, పేర్ని స్వరూప, ఎంపీపీ మేకల కలింగరాజు, ప్రమోద్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సందీప్, సుల్తాన్‌‌‌‌‌‌‌‌ రాజా, తిప్పారపు విజయ్, మామిడాల రాజు, నారోజు రామేశ్వరాచారి పాల్గొన్నారు.