నాలా పూడికతీత పనుల్లో స్పీడప్ ​పెంచాలి

కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు : నాలా పూడికతీత పనుల్లో స్పీడప్ పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శానిటేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం వరంగల్ పరిధిలోని పలు నాలాల పనులను  పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలా పూడికతీత పనుల్లో స్పీడప్ చేయాలి.

తీసిన సిల్ట్ ను తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ కృష్ణారావు, సీఎంహెచ్​వో డాక్టర్ రాజేశ్, ఈఈ శ్రీనివాస్, డీఈలు రంగారావు, సారంగం, రవికిరణ్, ఏఈ సతీశ్, శానిటేషన్ సిబ్బంది తదితరులున్నారు.