- బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను గురువారం బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మే 8 లోగా ప్రతి ఓటరుకు పోలింగ్ చీటి అందజేయాలని అన్నారు. ఉర్సు గుట్టు జంక్షన్ ప్రాంతంలోని జేఎస్ఎం పాఠశాలలో పోలింగ్ సెంటర్‌ను పరిశీలించారు. సెంటర్లో ర్యాంపు , కరెంట్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగేశ్వర్ రావు, డీఈలు రవికుమార్, సారంగం, కృష్ణమూర్తి, ఏఈ సరిత, తదితరులు ఉన్నారు.
బల్దియా ఆవరణలో ముగ్గుల పోటీలు
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధం అని వరంగల్ జిల్లా స్వీప్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం బల్దియా ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లీడ్ బ్యాంకు సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ఇచ్చారు. కార్యక్రమంలో సత్య లక్ష్మి, విశ్వజ, సత్యం, రాజు, రాజేశ్‌కుమార్, రమేశ్, వెంకట రమణ, ఆయూబ్ తదితరులు ఉన్నారు.