
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ సిటీలోని శానిటేషన్ పనులను ఆదివారం ఉదయం 5గంటలకు అశోక్జంక్షన్, పోలీస్హెడ్క్వార్టర్ వద్ద బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆకస్మిక తనిఖీ చేయడంతోపాటు అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి రోజు వివరాలను నమోదు చేయాలని, స్వీపింగ్ మిషన్లకు సంబంధించిన లాగ్‌బుక్‌ను పరిశీలించారు. ఆరోగ్యంపై శానిటేషన్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆమెవెంట ఎంహెచ్వో రాజేశ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు అనీల్, నిరంజన్ తదితరులున్నారు.