పనులు సకాలంలో పూర్తి చేయండి

పనులు సకాలంలో పూర్తి చేయండి
  • బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే
  • క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు  పరిశీలించిన కమిషనర్

వరంగల్​సిటీ, వెలుగు : అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. గురువారం  జీడబ్ల్యూఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి స్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని క్షేత్రస్థాయిలో కమిషనర్ పరిశీలించారు. చెత్త సేకరణలో నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.  రాంపూర్ బయో మైనింగ్ లో కొనసాగుతున్న పనులు రెండు నెలలుగా పూర్తిచేసి, ఆ స్థలాన్ని అప్పజెప్పాలని కమిషనర్ ఆదేశించారు.  

నయీమ్ నగర్ బ్రిడ్జ్ వద్ద రిటైనింగ్ వాల్స్ పనుల పురోగతిని పరిశీలించి వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. క్రిస్టియన్ కాలనీలో నిర్మాణం కొనసాగుతున్న కమ్యూనిటీ హాల్ కమిషనర్ పరిశీలించి నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజిరెడ్డి ,ఈ ఈ మహేందర్, సంతోష్ బాబు , స్మార్ట్ సిటీ పీఎంఈ భాస్కర్ రెడ్డి ,  ఏఈలు తదితరులు ఉన్నారు.