
- బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే
వరంగల్ సిటీ, వెలుగు : అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. గురువారం వరంగల్, హనుమకొండ లో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను పరిశీలించారు. సుందరయ్య నగర్ లో సీసీ రోడ్ డ్రైన్, 18 వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో ని కమ్యూనిటీ హాల్, చింతల్ లో సీసీ రోడ్ డ్రైన్, 33 వ డివిజన్ శాంతి నగర్ లో శ్మశాన వాటిక అభివృద్ధి పనులతో పాటు హనుమకొండ,హాసన్ పర్తి, భీమారం లో పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, సంతోష్ బాబు, డీఈలు రవి కిరణ్, రాజ్ కుమార్, ఏఈలు మోజామిల్, సతీశ్, స్మార్ట్ సిటీ పీఎంసీ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస ,రాజు తదితరులు
పాల్గొన్నారు.
తడి, పొడి చెత్తను వేరుగా అందించాలి
తడి పొడి చెత్తను వేరుగా అందించడం పై అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ -2024 అవగాహన కార్యక్రమంలో భాగంగా 56 వ డివిజన్ గోపాల్ పూర్ లో అవగాహన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు.