వరంగల్ సిటీ, వెలుగు : అభివృద్ధి పనుల్లో క్వాలిటీ పాటిస్తేనే బిల్లులు చెల్లిస్తామని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా స్పష్టం చేశారు. గ్రేటర్ వరంగల్ పోర్ట్ రోడ్డు విద్యానగర్ కాలనీ, బృందావన్ పబ్లిక్ స్కూల్, రంగశాయిపేటలోని శ్రీ సాయినగర్, నాగేంద్రనగర్ ఫేజ్ 2, కరీమాబాద్, ఉర్సు వాటర్ ట్యాంక్ ఏరియాల్లో నిర్మించిన సీసీ రోడ్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెండర్ రూల్స్ పాటిస్తూ అభివృద్ధి పనులు చేయాలని, పనుల్లో క్వాలిటీ లేకుంటే బిల్లుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు.
ఆయన వెంట సీఎంహెచ్‌వో రాజేశ్, ఈఈ శ్రీనివాస్, డీఈ రవికిరణ్, శానిటరీ సూపర్‌వైజర్ సాంబయ్య, ఏఈలు మొజామిల్, హబీబ్, శానిటరీ ఇన్స్‌పెక్టర్ వెంకన్న పాల్గొన్నారు. అనంతరం టీయూఎఫ్‌ఐడీసీ స్కీమ్ కింద చేపట్టే పనులపై ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వరదల నివారణ, భద్రకాళి నాలా
వడ్డేపల్లి నుంచి వెళ్లే నాలాలతో పాటు రిటైనింగ్ వాల్స్, బల్దియా పరిధిలోని 66 డివిజన్లలో కల్వర్టులు, అంతర్గత రోడ్ల గురించి చర్చించారు. సమావేశంలో ఎస్‌ఈలు కృష్ణారావు, ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్, ఐటీ మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు.