క్వాలిటీ పాటిస్తేనే బిల్లులిస్తం

వరంగల్​సిటీ, వెలుగు : పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే బిల్లులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్‌‌‌‌ షేక్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ బాషా స్పష్టం చేశారు. బల్దియా పరిధిలో నిర్మాణాలు పూర్తైన వివిధ అభివృద్ధి పనులను హనుమకొండ ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా హన్మకొండ బాలసముద్రంలో సీసీ రోడ్డు పనులు, నంది హిల్స్ సమీపంలోని కల్వర్టు, డ్రైన్‌‌‌‌ నిర్మాణం, శాయంపేట, ప్రెసిడెన్సీ స్కూల్‌‌‌‌ సమీపంలో డ్రైన్లు, గోకుల్‌‌‌‌నగర్‌‌‌‌లో నిర్మించిన

కమ్యూనిటీ హాళ్లను పరిశీలించారు. ఆయన వెంట డీఈ సంతోష్‌‌‌‌బాబు, టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ఆఫీసర్లు బషీర్, సుష్మ, ఏఈలు కార్తీక్‌‌‌‌రెడ్డి, అజ్మీరా శ్రీకాంత్, శానిటరీ ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ అనిల్‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం ఉనికిచర్ల లేఅవుట్‌‌‌‌లో డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మంచినీటి సరఫరా పైప్‌‌‌‌లైన్లను పరిశీలించారు. పనులను స్పీడప్‌‌‌‌ చేసి జనవరి ఫస్ట్‌‌‌‌ వీక్‌‌‌‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.