ఫోకస్ అంతా.. ఎన్నికల మీదే
ఎలక్షన్స్ పనుల్లో అధికారులు బిజీ బిజీ
హెల్త్ బులెటిన్‌లో మారని కంటెయిన్మెంట్ జోన్లు
ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటుపై నిర్లక్ష్యం
ప్రత్యేకాధికారులకు నోడల్ ఆఫీసర్లుగా బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో కరోనా కేసులు వందల్లో వస్తున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడం వదిలేసి జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టారు. కొద్దిరోజుల నుంచి అదే పనిలో బిజీగా ఉన్నారు. 2021 ఫిబ్రవరికి ఇప్పటి పాలక మండలి టైం ముగుస్తుండడంతో ఎలక్షన్స్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో కంటెయిన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలన్న కేంద్రం గైడ్‌లైన్స్‌నూ పక్కన పెట్టేశారు.
కేసులు పెరుగుతున్నా…
గ్రేటర్లో 82 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు డైరెక్టర్ఆఫ్ హెల్త్ బులిటెన్‌లో చూపిస్తున్నా, నెల రోజుల నుంచి అవే ఏరియాలు ఉంటున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గ్రేటర్లో ఇప్పటివరకు 58,922 వేల కేసులు నమోదయ్యాయి. డైలీ వందల్లో వస్తూనే ఉన్నాయి. ఈ నెలలో 7,363 కేసులు వచ్చాయి. బులిటెన్‌లో చూపని కేసులు అంతకు రెట్టింపే ఉన్నాయి. అయినా కంటెయిన్మెంట్ల జోన్లలో ఎలాంటి మార్పులూ ఉండడం లేదు. జోన్లలో పటిష్ట చర్యలు తీసుకోవాలన్న కేంద్రం ఆదేశాలనూ బల్దియా అధికారులు లెక్క చేయడం లేదు. కరోనా ప్రారంభంలో హడావిడి చేసినా.. ఇప్పుడు మొత్తానికే చేతులెత్తేశారు. అప్పట్లో డైలీ మీటింగ్‌లు పెట్టి, పరిస్థితులు సమీక్షించేవారు. ప్రస్తుతం సమావేశాల మాటే మర్చిపోయారు. కమిషనర్‌తోపాటు జోనల్ కమిషనర్లు బల్దియా ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. కంటెయిన్మెంట్జోన్లకు స్పెషల్ఆఫీసర్లుగా ఉన్న ఎనిమిది మంది అధికారులను కమిషనర్ ఇప్పుడు ఎన్నికల ఎన్నికల నోడల్ ఆఫీసర్లుగా నియమించారు.
పాజిటివ్ వచ్చినా పట్టించుకోట్లే
కరోనా పాజిటివ్వచ్చి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారికి అధికారులు ఐసోలేషన్ కిట్లు కూడా ఇవ్వడం లేవు. పేషెంట్లు అడిగితే.. అందుబాటులో లేవు, ఇంటికి పంపిస్తామంటూ దాటవేస్తున్నారు. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పేవారు కూడా కరువయ్యారు. ఫోన్ ద్వారా ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాల్సిన ఉన్నా పట్టించుకోవడం లేదు. పాజిటివ్ పేషెంట్లు ఎప్పటికప్పుడు పల్స్ చెక్ చేసుకుంటుండాలి. కానీ, కిట్స్ అందకపోవడం వల్ల పేదలు డబ్బు పెట్టి పల్స్ఆక్సీమీటర్ కొనుగోలు చేయలేకపోతున్నారు. దాంతో కొన్నిసార్లు కండిషన్ సీరియస్ అవుతోంది. మరోవైపు ఇంట్లో ఉండడానికి వసతి లేని పాజిటివ్ పేషెంట్ల కోసం ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాలనూ అమలు చేయడం లేదు. ఒక్కో సర్కిల్లో 3 నుంచి 5 సెంటర్లు పెట్టాలని కమిషనర్ నిర్ణయించినా, మొత్తంగా నాలుగైదుకి మించి ఏర్పాటు చేయలేదు. ఉన్న సెంటర్లలోనూ సౌలత్లు కల్పించ లేదు.
For More News..