హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ రోడ్లపై వెహికల్ స్పీడ్ లిమిట్‌కు సంబంధించి బల్దియా సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్ లిమిట్స్‌లో ప్రస్తుతం గంటకు 60 కి.మీ. స్పీడ్ లిమిట్మాత్రమే ఉంది. మధ్యలో డివైడర్ ఉండి 2 లేన్లు, అంతకుపైగా ఉన్న రోడ్లపై కార్లకు గంటకు 60 కి.మీ , బైక్‌లు, మిగతా వెహికల్స్ కు 50 కి.మీ. వేగంతో ప్రయాణించాలనే రూల్ఉంది. డివైడర్ లేని రోడ్లపై కార్లు అయితే 50 కి.మీ. వేగం, టూవీలర్, మిగతా వెహికల్స్ 40 కి.మీ. స్పీడ్ తో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పటికే మెయిన్ రోడ్లపై స్పీడ్ లిమిట్‌కు సంబంధించిన సైన్ బోర్డులను జోనల్ స్థాయిలో బల్దియా అధికారులు ఏర్పాటు చేశారు.
ప్రమాదాలను నివారించేందుకు..
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్ లిమిట్‌ను ఫాలో కావాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ తక్కువగా ఉన్న రోడ్లపైనే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాలనీల్లోని రోడ్లపై కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఓవర్ స్పీడ్ వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు స్పీడ్ లిమిట్‌ను నిర్ణయించారు. యాక్సిడెంట్లను కంట్రోల్ చేయాలంటే సైన్ బోర్డులను ఏర్పాటు చేసి, పలు డిపార్ట్ మెంట్లతో కలిసి మరింత అవగాహన కల్పిస్తామని బల్దియా అధికారులు చెబుతున్నారు.
కో ఆర్డినేషన్ మీటింగ్‌లు
స్పీడ్ లిమిట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఆరు నెలల కిందటే వచ్చింది. జోనల్ స్థాయిలో రవాణా, ట్రాఫిక్ పోలీసులతో కో ఆర్డినేషన్ మీటింగ్‌లు నిర్వహించిన అనంతరం జీహె
చ్ఎంసీ అధికారులు సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల్లో కాలనీ రోడ్లపై వీటిని ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ జోనల్ స్థాయి అధికారులు చెబుతున్నారు.