సెప్టిక్ ట్యాంక్ శుభ్రతపై అవగాహన కల్పించాలి
బల్దియా మేయర్ సుధారాణి
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : గ్రేటర్ వాసులకు సెప్టిక్ట్యాంక్శుభ్రతపై అవగాహన కల్పించాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం బల్దియాలోని హెడ్ ఆఫీస్‌లో శానిటేషన్, రెస్పాన్స్ యూనిట్(ఎస్‌ఆర్‌యు) సఫాయి మిత్ర సురక్ష షహర్‌పై ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి మూడేండ్లకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రపరచుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యంత్రాల ద్వారానే సెప్టిక్‌ట్యాంకులు క్లీన్చేయాలన్నారు. సఫాయి మిత్ర కార్మికులకు అవసరమైన భద్రత పరికరాలు జీడబ్ల్యూఎంసీ ద్వారా అందిస్తూ వారి రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్, సెక్రటరీ విజయలక్ష్మీ, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, శానిటేషన్, ఆస్కి, ప్రతినిధులు పాల్గొన్నారు.
వీధి వ్యాపారుల లోన్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి
గ్రేటర్ పరిధిలోని వీధి వ్యాపారులకు అందజేసే లోన్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని బల్దియా కమిషనర్ ప్రావీణ్య అన్నారు. బల్దియా హెడ్ ఆఫీస్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా
కమిషనర్ మాట్లాడుతూ వీధి వ్యాపారుల సంక్షేమం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మంజూరైన లోన్లను వారంలోగా అందజేయాలన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకు 61శాతం బ్యాంక్ లింకేజీలు పూర్తి చేసినట్లుగా కమిషనర్వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్రవీందర్యాదవ్, సీఎంహెచ్ఓ, బల్దియా ఆఫీసర్లు పాల్గొన్నారు.
స్టూడెంట్లకు పౌష్టికాహారం అందించాలి : ఐటీడీఏ పీవో అంకిత్
వెంకటాపూర్, ములుగు, వెలుగు : ఆశ్రమ స్కూళ్లలో పరిశుభ్రత పాటించాలని, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. గోవిందరావుపేట మండలం కర్లపల్లి బాలుర ఆశ్రమ స్కూల్‌ను పీవో అంకిత్ తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్ షెడ్, వసతి, తరగతి గదులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. పీవో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు టైంకు స్కూల్‌కు రావాలని, నిత్యం విద్యార్థులపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పీవో కాసేపు మాట్లాడారు.
రోడ్లపైనే వడ్లు.. వాహనదారులు జర పైలం
యాసంగి కోతలు షురూ అయ్యాయి. ఇంకా కొనుగోలు సెంటర్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు రోడ్లపైనే వడ్లను ఆరబోస్తున్నారు. వాటి చుట్టూ రాళ్లను హద్దులుగా పెడుతుండటంతో రాత్రిళ్లు వాహనదారులు జరంత పైలంగా పోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. కమలాపూర్ మండలం హుజూరాబాద్– పరకాల మెయిన్‌రోడ్డులో ఉప్పల్ శివారులో, శంభునిపల్లి బ్రిడ్జిపై ఇలా రోడ్లపై వడ్లు ఆరబోసి బండరాళ్లను అడ్డుగా పెట్టారు. - కమలాపూర్, వెలుగు
ఖోఖో నేషనల్స్ కు హైస్కూల్ స్టూడెంట్స్
నెక్కొండ, వెలుగు : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి జడ్పీహెచ్ఎస్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఖోఖో జాతీయ స్థాయి పోటీలకు సెలక్ట్ అయినట్లు హెచ్ఎం సుజన్‌తేజ బుధవారం తెలిపారు. బుధవారం స్కూల్లో సెలక్లయిన స్టూడెంట్స్‌ను టీచర్లు అభినందించారు.
పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయాలి
హసన్ పర్తి, వెలుగు : ఇటీవల విడుదలైన ఎస్ఐ , కానిస్టేబుల్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, క్వాలిఫై కాని అభ్యర్థులకు న్యాయం చేయాలని కేయూ బీసీ విద్యార్థి సంఘం ఇన్చార్జి నాగరాజు గౌడ్ డిమాండ్‌చేశారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ గేటు ముందు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. ఎస్ఐ, కానిస్టేబుల్ పోలీస్ నియామకాల్లో బీసీలకు కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు.
గర్భిణుల రక్తహీనతపై పైలట్ ప్రాజెక్టుగా ములుగు
వెంకటాపూర్, ములుగు, వెలుగు : గర్భిణుల్లో రక్త హీనతపై టెస్ట్‌లు చేసేందుకు ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టు గా సెలక్ట్ చేసినట్లు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ వెల్లడించారు. బుధవారం ములుగు మండలం రాయినిగూడెం, గోవిందరవుపేట, పస్రా పీహెచ్‌సీలను మెటర్నల్ హెల్త్, న్యూట్రిషన్ డాక్టర్ సుదర్శన సూర్య, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుజాత, టెక్నికల్ టీం భరత్, డీఎంహెచ్‌వో అప్పయ్యలతో కలిసి తనిఖీ చేశారు.
ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు : కలెక్టర్ శివలింగయ్య
జనగామ అర్బన్, వెలుగు : ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జనగామ కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ క్యాంపు ఆఫీస్‌లో ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చేపట్టవలసిన చర్యలపై రవాణా, ఆర్టీసీ అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు వాహనాల్లో ఓవర్‌లోడ్ కంట్రోల్చేయాలని, రూల్స్ పాటించని వాహనాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. రివ్యూలో ఏసీపీ దేవేందర్ రెడ్డి, ఆర్టీవో శ్రీనివాసరావు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి, జనగామ డిపో మేనేజర్ జోస్న పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో సింగరేణి ఎంప్లాయ్ మృతి
కమలాపూర్, వెలుగు : కమలాపూర్‌కు చెందిన సింగరేణి ఎంప్లాయ్ కోలకాని రాజేశ్(34) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి సింగరేణిలో పనిచేసే రాజేశ్‌కు 10 నెలల కింద యాక్సిడెంట్కావడంతో సిక్ లివ్‌లో ఉంటున్నాడు. ఇంటి అవసరాలకు డబ్బు అవసరమవడంతో ఈనెల19న కమలాపూర్ వచ్చాడు. తెలిసిన వారిని డబ్బు అడిగినా ఎవరూ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి లోనయ్యాడు. అప్పటి నుంచి రాజేశ్ ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. బుధవారం కమలాపూర్ సమ్మక్క–సారక్క గుట్ట వద్ద రాజేశ్ శవం కనిపించింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడా, హత్యకు గురయ్యాడా తెలియాల్సి ఉంది. మృతుని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సంజీవ్ తెలిపారు.
పాము కాటుతో మహిళ...
రఘునాథపల్లి, వెలుగు : పాము కాటుతో పబ్బోజు సుజాత (36) అనే మహిళ చనిపోయింది. పోలీసులు, కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి నిడిగొండకు చెందిన సుజాత ఈ నెల 20న ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు జనగామ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరేందర్ తెలిపారు.
ఖోఖో నేషనల్స్ కు హైస్కూల్ స్టూడెంట్స్
నెక్కొండ, వెలుగు : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి జడ్పీహెచ్ఎస్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఖోఖో జాతీయ స్థాయి పోటీలకు సెలక్ట్ అయినట్లు హెచ్ఎం సుజన్‌తేజ బుధవారం తెలిపారు. బుధవారం స్కూల్లో సెలక్లయిన స్టూడెంట్స్‌ను టీచర్లు అభినందించారు.