కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: హనుమకొండ బాలసముద్రంలోని మున్సిపాలిటీ వాహన మరమ్మతులు, ట్రాన్స్పోర్ట్షెడ్లను బల్దియా మేయర్గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బుధవారం పరిశీలించారు. సర్వసభ్య సమావేశంలో జరిగిన అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు మరమ్మతుల కోసం ఆగి ఉన్న వాహనాలను చూసిన అనంతరం వారు మాట్లాడారు.
సేకరించిన చెత్తను షెడ్ నుంచి భారీ వాహనాలకు తరలించే క్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందిగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని బల్దియా అధికారులను ఆదేశించారు. వాహనాలకు వీలైనంత త్వరగా మరమ్మతులు జరిపి విధులకు పంపించాలని కార్మికులకు తెలిపారు. విధులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.