బల్దియా నోటీసులు డోంట్ కేర్.. కరీంనగర్ డెయిరీలోకి బల్దియా సిబ్బందికి నో ఎంట్రీ

బల్దియా నోటీసులు డోంట్ కేర్.. కరీంనగర్ డెయిరీలోకి బల్దియా సిబ్బందికి నో ఎంట్రీ
  • తమకు మున్సిపాలిటీ ట్యాక్స్ వర్తించదని యాజమాన్యం మొండి వాదన
  • ఉనికిలో లేని పంచాయతీ పేరు చెప్పి ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్గొట్టే ప్రయత్నం
  • నోటీసులిచ్చినా పట్టించుకోని వైనం
  • కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన బల్దియా సిబ్బంది

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ డెయిరీ ఉన్న పద్మానగర్ పంచాయతీ కరీంనగర్  మున్సిపల్ కార్పొరేషన్ లో కలిసి ఐదేళ్లయినా.. డెయిరీ యాజమాన్యం మాత్రం ఇంకా తాము పంచాయతీ పరిధిలోనే ఉన్నామని మొండివాదనకు దిగుతున్నట్లు తెలిసింది.  

ఐదున్నర నెలల క్రితమే ఇచ్చిన బల్దియా ఇచ్చిన నోటీసులను బేఖాతర్ చేయడం, తాజాగా ప్రాపర్టీ ట్యాక్స్ భారీ ఎగవేతపై ‘వీ6 వెలుగు’ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టోరీ పబ్లిష్ అయ్యాక మరోసారి కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బంది వెళ్తే లోపలికి రానివ్వకపోవడం వివాదాస్పదంగా మారింది.

మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని సౌకర్యాలు పొందుతూ ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు ఉనికిలో లేని పంచాయతీ పేరు చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని సౌకర్యాలు పొందుతూ ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు ఉనికిలో లేని పంచాయతీ పేరు చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఐదేళ్ల క్రితమే విలీనం.. 

కరీంనగర్ డెయిరీ కరీంనగర్ అర్బన్ రెవెన్యూ విలేజీ పరిధిలో గల 1221/1 సర్వే నంబర్ లో నిర్మాణమైంది. గతంలో ఈ డెయిరీ పద్మానగర్ జీపీ పరిధిలో ఉండగా.. 2019లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన విషయం తెలిసిందే. విలీన గ్రామాల్లో మూడేళ్ల వరకు ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు ఉండదని అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లెక్కన అక్టోబర్ 2022 నుంచే పద్మానగర్ జీపీ పరిధిలోని కరీంనగర్ డెయిరీలాంటి కమర్షియల్ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రీఅసెస్ మెంట్  చేసి బల్దియా రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం ట్యాక్స్ విధించాల్సి ఉంది. 

కానీ రెవెన్యూ సిబ్బంది ఇలాంటి కమర్షియల్ భవనాల జోలికి వెళ్లకుండా కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే ఆదాయానికి గండికొడుతున్నారు. ఓ వైపు నిధుల్లేక విలీన గ్రామాల్లో అభివృద్ధి చేయలేకపోతున్నామని పాలకవర్గం చెబుతుండగా.. రూ.15 లక్షల వరకు ట్యాక్స్ వచ్చే కరీంనగర్ డెయిరీలాంటి కమర్షియల్ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 21న జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో డెయిరీ విషయాన్ని కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ లేవనెత్తగా.. మూడు రోజుల్లో కొత్త ట్యాక్స్ విధిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఇది జరిగి రెండు వారాలైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

 

జులైలోనే నోటీసులిచ్చాం.. 

రీఅసెస్ మెంట్ చేసేందుకు కరీంనగర్ డెయిరీకి జులై 15న నోటీసులిచ్చాం. డెయిరీ నిర్మాణ ప్లాన్, కన్ స్ట్రక్షన్ పర్మిషన్, రిజిస్ట్రేషన్ పేపర్లు, లింక్ డాక్యుమెంట్ల కాపీలు మూడు రోజుల్లో సమర్పించాలని కోరాం. దీంతో వారు తమ డెయిరీ జీపీ పరిధిలో ఉందని సమాధానమిచ్చారు. ‘వీ6వెలుగు’లో వార్త వచ్చాక మళ్లీ వెళ్లి అడిగితే రీఅసెస్ మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. కమిషనర్ నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం. - కృష్ణయ్య, ఆర్ఐ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్