మళ్లీ తెరమీదకు యావర్​ రోడ్డు విస్తరణ

జగిత్యాల, వెలుగు : ఎన్నికలు సమీపిస్తుండగా జగిత్యాల జిల్లాకేంద్రంలోని కరీంనగర్– ధర్మపురి(యావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రోడ్డు విస్తరణ మళ్లీ తెరమీదకు వచ్చింది. రోడ్డు విస్తరణలో ఇండ్లు, షాపులు కోల్పోతున్న వారికి బల్దియా ఆఫీసర్లు టీడీఆర్(  ట్రాన్ఫరబుల్​ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ​రైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  బాండ్లు ఇవ్వనున్నారు.  షాపులు కోల్పోతున్న వారికి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిహారం అందించే వీలు లేకపోవడంతో..  టీడీఆర్​అమలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.  
 
రోడ్డు విస్తరణ కోసం టీడీఆర్​లు

 యావర్​రోడ్డు 30 ఏండ్లుగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ రోడ్డు విస్తరణ అస్త్రంగా మారుతోంది.  గత 15 రోజులుగా రోడ్డు విస్తరణకు బల్దియా ఆఫీసర్లు సర్వే చేపడుతున్నారు.  ఆస్తులు కోల్పోతున్న బాధితులను గుర్తించి రిజిస్ట్రేషన్​వ్యాల్యూకు మూడింతల లాభం పొందేలా టీడీఆర్​ బాండ్​ జారీ  చేస్తామని  బల్దియా ఆఫీసర్లు చెబుతున్నారు.  రోడ్డు విస్తరణలో ఓ వ్యక్తి 20గజాల స్థలం కోల్పోతే అతనికి 60 నుంచి 80 గజాల స్థలానికి విలువైన టీడీఆర్​జారీ చేస్తారు. ఈ బాండ్​ను  సదరు యాజమాని ఇతరులకు అమ్ముకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.  దీని ద్వారా– పరిహారం  రెట్టింపు లేదా అంతకుమించి వచ్చే  అవకాశం ఉంటుంది. 

ALSO READ: విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్ 

బల్దియా, అసెంబ్లీ ఎన్నికలప్పుడే.. 

జగిత్యాలలో యావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ధర్మపురికి వెళ్లేందుకు కీలకంగా ఉంది. దీంతో రద్దీ కూడా అదే స్థాయి లో పెరిగింది. కాగా 40,60,80 ఫీట్లుగా ఉన్న రోడ్డుపై ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు యాక్సిడెంట్లు కూడా పెరిగాయి. యావర్ రోడ్డును 100 ఫీట్లకు విస్తరించాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. కాగా ఈ డిమాండ్​మూడు దశాబ్దాలుగా ఉంది. బల్దియా, జనరల్​ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారీ యావర్​రోడ్డు విస్తరణ ప్రచార అస్త్రంగా మారుతోంది. 

600 ఆస్తుల గుర్తింపు

జగిత్యాల జిల్లా కేంద్రం లోని కరీంనగర్ రోడ్డు నుంచి కొత్తబస్టాండ్, చౌరస్తా, పాత బస్టాండ్, ధర్మపురి రోడ్డు వరకు విస్తరణ పనులు చేపట్టాలని ఆఫీసర్లు సర్వే చేపట్టారు. ఈ మేరకు షాపులు, ఇండ్లు దాదాపు 600 అసెట్లకుపైగా గుర్తించారు. సర్కార్ బాధితులకు నష్ట పరిహారానికి బదులుగా టీడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెరమీదకు తీసుకువచ్చింది. ఇలా గుర్తించిన ఆస్తులకు రిజిస్ట్రేషన్​వ్యాల్యూకు మూడింతలు లాభం పొందేలా చాన్స్ ఉందని ఆఫీసర్లు చెపుతున్నారు.

జగిత్యాల మున్సిపల్ పరిధిలో టీడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ లేకపోవడంతో రాష్ట్రంలోని జీహెచ్ఎంసీతో పాటు ఇతర కార్పోరేషన్లు, బల్దియాల్లో జగిత్యాలకు  చెందిన టీడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అమ్ముకునేలా సర్కార్ స్పెషల్ జీవో విడుదల  చేసింది. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్స్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా తీసుకువచ్చి అవగాహన కల్పించేలా ఆఫీసర్లు ప్రణాళిక రూపొందిస్తున్నారు.