కబ్జాదారులపై బల్దియా ఉక్కు పాదం.. వరంగల్లో అక్రమకట్టడాలు కూల్చివేత

ఖిలా వరంగల్: వరంగల్ లోని పుల్లయ్య కుంటలో బీఆర్ఎస్ పార్టీ జాగాలో నిర్మించిన అక్రమ కట్టడాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. పార్టీ కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు జరిగాయని వరంగల్​బల్దియా అధికారులకు, పోలీసులకు   బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.  

ఈ నేపథ్యంలో బల్దియా కమిషనర్ రిజ్వాన్ బాషా, సీపీవో వెంకన్న నేతృత్వం లో అధికారులు  ఇవాళ తెల్లవారు జామున అక్రమ నిర్మాణాలను తొలగించారు. కాగా అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు.  హనుమకొండలోని కాపు సంఘం కాలనీలో అనుమతి  పొందినా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బిల్డింగ్ను సైతం అధికారులు తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.