ఎన్నికల కసరత్తు షురూ చేసిన బల్దియా

ఎన్నికల కసరత్తు షురూ చేసిన బల్దియా

ఎన్నికలకు రెడీ

కసరత్తు షురూ చేసిన బల్దియా

నోడల్ ఆఫీసర్ల నియామకం
బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించే చాన్స్
‘ముందస్తు’కి వెళ్లడం కష్టమే!

హైదరాబాద్, వెలుగు: జీహెచ్​ఎంసీ​ఎన్నికలకు అధికార యంత్రాంగం రెడీ అవుతోంది. కరోనా ప్రభావం ఉన్నా, ప్రికాషన్స్​ తీసుకుని పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 2016 ఫిబ్రవరి 2న బల్దియాకు ఎన్నికలు జరిగాయి. అదే నెల10న పాలకమండలి కొలువు దీరింది. 2021 ఫిబ్రవరి10కి ఇప్పుడున్న కమిటీ టైమ్​ ముగుస్తుంది. ఆలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్​ మంగళవారం నోడల్ ఆఫీసర్లను నియమించారు. కరోనా  తీవ్రత  తగ్గుముఖం పట్టకపోతే బ్యాలెట్​ పేపర్ల ద్వారా  ఓటింగ్​ నిర్వహించే అవకాశముంది. ఒక్కో పోలింగ్ స్టేషన్​లో 800 ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.

టీఆర్​ఎస్​కి ‘డబుల్’ ట్రబుల్

ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ముందస్తు ఎన్నికలు కష్టమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్  నేతలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చకపోవడంపై జనంలో వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్​లోని 150 డివిజన్లలో ఇండ్లు లేని ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ​ఇండ్లు ఇస్తామని మంత్రులతోపాటు కార్పొరేట్​ అభ్యర్థులు చెప్పారు. అప్పట్లో లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. నిర్మాణాలు మాత్రం వందల్లో చేపట్టి, అక్కడక్కడా లబ్ధిదారులకు అందించారు. చాలావరకు ఇండ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆ పనులు త్వరగా పూర్తిచేసి మరికొంతమంది ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా వారికి ఎన్నికల అనంతరం ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉంది.

బ్యాలెట్ వైపే ఇంట్రెస్ట్​

ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఎస్‌‌‌‌ఈసీ లెటర్స్​కూడా పంపింది. కరోనా పరిస్థితుల్లో ఎలక్షన్స్​ బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ ద్వారా నిర్వహించాలా, ఈవీఎంలను ఉపయోగించాలా అనే దానిపై అభిప్రాయం తెలపాలని కోరింది. ఈ నెల 30 లోపు పార్టీలు తమ సూచనలు ఇవ్వాల్సి ఉంది. కాగా, పార్టీలు కూడా బ్యాలెట్  వైపే ఇంట్రెస్ట్​ చూపిస్తున్నాయి. ఈవీఎంలతో నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తున్నాయి.

నోడల్​ ఆఫీసర్లు వీరే..

అధికారి           బాధ్యతలు

జి.వెంకటేశ్వర్లు   ఎలక్టోరల్​( ప్రింటింగ్, బ్యాలెట్ పేపర్స్)

ఎస్.పంకజ        బీసీ ఓటర్ల గణన, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం

పి.సరోజ           పోస్టల్​ బ్యాలెట్

ఎ.విజయలక్ష్మి   ఎన్నికల సామగ్రి సేకరణ

రాహుల్​రాజ్​      సిబ్బంది ఎంపిక

జయరాజ్​          ఐటీ వర్క్స్​, వెబ్ క్యాస్టింగ్

జె.శంకరయ్య      ట్రైనింగ్

ఎన్.యాదగిరిరావు     బ్యాలెట్ బాక్సుల సేకరణ

విశ్వజిత్​ కంపాటి   కోడ్ అమలు, ఫ్లైయింగ్ స్క్యాడ్, ఎన్​ఫోర్స్​మెంట్ ​టీమ్స్

నాగేశ్వర్​రావు     అసెస్​మెంట్, ట్రాన్స్​పోర్ట్

మహ్మద్​ జీయుద్దిన్    డీ ఆర్ సీ గుర్తింపు, పోలింగ్​ స్టేషన్లలో వసతుల కల్పన

ఎస్.దేవేందర్ రెడ్డి       లైజనింగ్, వసతుల ఏర్పాట్లు

వి.కృష్ణ              మైక్రో అబ్జర్వర్స్​ నియామకం

వై.వెంకటేశ్వర్లు   మెడికల్ సెల్, పెయిడ్ న్యూస్, మీడియా మానిటరింగ్ సెల్

మహబూబ్ భాష        కంట్రోల్​ రూమ్​

వెంకటేశ్వర్లు       ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ

ప్రియాంక ఆల     రిపోర్ట్స్, రిటర్న్స్​

బదావత్​ సంతోష్​        హెల్త్, వెల్ఫేర్

కమిషనర్​ మీటింగ్

నోడల్ ఆఫీసర్లుగా నియమితులైన అదనపు కమిషనర్లు, విభాగాధిపతులతో కమిషనర్ ​లోకేశ్​ కుమార్​  మీటింగ్​ నిర్వహించారు. ఎలక్టోరల్ రోల్ ప్రిపరేషన్​, ప్రింటింగ్, ఓటర్ ఎన్యూమరేషన్, రిటర్నింగ్​, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకంపై చర్చించారు.  పోలింగ్ సిబ్బందికి శిక్షణ, ఎలక్షన్ మెటీరియల్, గుర్తింపు, వెబ్ కాస్టింగ్, ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్​లు,  పోలింగ్, కౌంటింగ్ సెంటర్ల గుర్తింపు, వసతులు కల్పన, మైక్రో అబ్జర్వర్లు తదితర అంశాల గురించి​ దిశానిర్దేశం చేశారు. స్టేట్​ ఎలక్షన్​కమిషన్​ నోటిఫికేషన్ ఇచ్చేలోపే ప్రణాళికతో రెడీగా ఉండాలని ఆదేశించారు. ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమిషనర్లు బాదావత్ సంతోశ్​, ప్రియాంక అలా, పీఎస్ రాహుల్ రాజ్, జయరాజ్ కెన్నడీ, వి. కృష్ణ, జె.శంకరయ్య, చీఫ్ ఇంజినీర్ మహ్మద్ జియావుద్దీన్ పాల్గొన్నారు.

For More News..

అసైన్డ్ భూములపై కన్నేసిన ప్రభుత్వం

గ్రేటర్‌‌ జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు

పురుగుల మందు తాగించినా బతికిన కవలలు