బాలి ఫొటోగ్రాఫర్ సాహసం

బాలి ఫొటోగ్రాఫర్ సాహసం

కొండ అంచున ఉన్న విమాన రెక్కపై ఓ వ్యక్తి నడిచాడు. ఆ అందులో విశేషం ఏముంది అంటారా ?  ఆ విమానం రెక్క కొండ లోయ మీదకు ఉంది. రెక్క కొన వైపు వరకు అతను నడిచాడు. ఓ వైపు గాలి వీస్తున్నా.. ధైర్యంతో ముందుకు నడవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. earthpix పేరిట ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో వీడియో పోస్టు చేశారు. రెండు రోజుల క్రితం చేసిన ఈ వీడియోను దాదాపు 5 లక్షల మందికి పైగా చూశారు. అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. 

 

బాలి.. బడంగ్ రీజెన్సీలోని ఓ బీచ్ వద్ద సముద్ర తీరం వద్ద పాత పెద్ద బోయింగ్ విమానం ఉంచారు. దీని రెక్కలు కొండ లోయపై సముద్రం మీదుగా ఉంటాయి. ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. బాలికి చెందిన ఓ ఫొటోగ్రాపర్ ఇక్కడకు వచ్చాడు. విమానం పైకి ఎక్కి.. రెక్కపై నడిచేందుకు ప్రయత్నించాడు. ఏ మాత్రం భయం లేకుండా.. ఎంతో ధైర్యంతో రెక్క కొన వరకు నడిచాడు. రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఎర్త్ పిక్స్  (earthpix) టూరిస్టు ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడి ధైర్య సాహసాలను కొంతమంది ప్రశంసిస్తే... జాగ్రత్తలు తీసుకోకపోవడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ? EarthPix ? (@earthpix)

మరిన్ని వార్తల కోసం : -
పుతిన్ మూడేళ్లకు మించి బతకడం కష్టమే ?


క్వారెంటైన్‌‌ నుంచి బయటికెళ్లిండు.. వెయ్యి మందిని తోడు తెచ్చుకుండు