జనం నిలదీస్తారని పర్యటన రద్దు..బాల్క సుమన్

జైపూర్, వెలుగు: చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలంలోని వేలాల, పౌనూర్, ఎల్కంటి, ఇందారంలోని దొరగారిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మంగళవారం  పర్యటిస్తారని ముందుగా ప్రకటించారు. దొరగారిపల్లిలో ప్రైమరీ స్కూల్ ను ఓపెన్ చేస్తారని పేర్కొన్నారు.  దొరగారిపల్లి ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్​ప్రభావిత ప్రాంతం. ఓసీపీ ఏర్పాటు సమయంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, స్థానికులకు ఉద్యోగాలు రాలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో బాల్క సుమన్ ను నిలదీసేందుకు సిద్ధమయ్యారనే సమాచారంతో ఆయన దొరగారిపల్లి పర్యటనను రద్దు చేసుకున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. సాయంత్రం దొరగారిపల్లికి రాకుండానే వేలాల, పౌనూర్, ఎల్కంటి గ్రామాల్లోని ప్రోగ్రామ్స్​లో పాల్గొనడం గమనార్హం.