వరంగల్, వెలుగు: ‘ఏయ్ బాల్క సుమన్.. పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నవ్.. కండ కావురమా.. మదమా.. డబ్బులు ఎక్కువై పిచ్చి లేసిందా..’ అంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య ఫైర్ అయ్యారు. బాల్క సుమన్ సీఎం రేవంత్‍రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన సుమన్‍పై సీరియస్‍గా రియాక్ట్ అయ్యారు. 'నాలుక మందమైతే ఉప్పు పసుపు పెట్టి రాకుతం.. బుద్ధి లేదా.. చదువుకోలేదా.. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్‍రెడ్డిని నోటికొచ్చిన్టట్లు మాట్లాడితే నాలుక చీరేస్తాం' అంటూ హెచ్చరించారు. 'కేసీఆర్ బూట్లు నాకు.. కేటీఆర్ పాదాలు నాకు.. వాళ్లు మెచ్చుకుంటరు.
అట్ల కూడా మెచ్చుకోకుంటే వాళ్లకి ఫోన్ చేసి చెప్తా.. నువ్వేంటి.. నీ స్థాయేంటి.. నువ్వు పెద్దపల్లి పోయినప్పుడు రబ్బరు చెప్పులతో పోయినవ్ కొడకా.. ఇన్ని డబ్బులు ఎట్లొచ్చినయ్? ప్రజలను ముంచి మోసం చేసి సంపాదించి ఇష్టారీతిన మాట్లాడుతున్నవ్.. పెద్దపల్లి, చెన్నూరు ప్రజలు ఉరికిచ్చి కొడతరు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పు.. లేదంటే ఉరికిస్తం.. బాల్క సుమన్‍ను మెట్టుపల్లి పొలిమేర వరకు పెద్దపల్లి ప్రజలు ఉరికిచ్చి కొట్టాలి’ అంటూ రాజయ్య పిలుపునిచ్చారు.