తలుపులు వేసి పోలింగ్ .. చెన్నూరు సెగ్మెంట్ లో అధికారుల నిర్వాకం

తలుపులు వేసి పోలింగ్ ..  చెన్నూరు సెగ్మెంట్ లో అధికారుల నిర్వాకం

మంచిర్యాల: చెన్నూర్ మండలం పొన్నారం ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ స్టేషన్ 160లో ఎన్నికల అధికారులు తలుపులు పెట్టి పోలింగ్ నిర్వహించారు. ఈ విషయమై ప్రశ్నించగా.. ఓటర్లను కంట్రోల్ చేయలేక డోర్స్ వేసి నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ కృష్ణ ఎన్నికల అధికారుల తీరుపై మండిపడ్డారు. పోలింగ్ సిబ్బంది, పోలీసులను ప్రశ్నించారు. అనంతరం ఈ అంశంపై ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ లీడర్లు తమ ఫోన్లపై లోగోలతో, సీక్రెట్ కెమెరాలతో వీడియోలు కూడా తీస్తున్నారని, వాళ్లనెవ్వరూ ఆపడం లేదని వంశీ కృష్ణ చెప్పారు.

 మరో వైపు తెలంగాణ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. 119 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల మినహా  పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.  ఈ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో  బీఆర్ఎస్, కాంగ్రెస్ 118 నియోజకవర్గాల్లో  పొత్తులో ఒక చోట సీపీఐ బరిలోకి దిగింది. 111 చోట్ల బీజేపీ పోటీ చేయగా..  పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది.  మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.