![సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. బాల్కసుమన్ కు నోటీసులు](https://static.v6velugu.com/uploads/2024/02/balka-suman-received-notice-from-mancherial-district-police_EYABr7imyk.jpg)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మంచిర్యాల జిల్లా పోలీసులు 41CRPC నోటీసులు అందించారు. హైదరాబాద్ శివారు చల్లాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నోటీసులు తీసుకున్న బాల్క సుమన్ .. పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తన మీద కేసు నమోదు చేసిందని బాల్క సుమన్ ఆరోపించారు. ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ తమదని, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసారు.
— Balka Suman (@balkasumantrs) February 11, 2024
ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన నోటీసులు ఇవ్వడం జరిగింది.
ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ మాది, కచ్చితంగా కాంగ్రెస్… pic.twitter.com/A7eU8HoyjS
మంచిర్యాల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చెప్పు చూపించారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పదవిని బట్టి, స్థాయిని బట్టి బాల్క సుమన్ మాట్లాడాలని.. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారన్నారని మండిపడ్డారు.
ALSO READ :- యాదాద్రి కొండపైకి ఆటోల అనుమతి
సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడుతూ.. బాల్క సుమన్ చెప్పులు చూపించటంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సుమన్‌పై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు కేసులు నమోదు చేశారు. బాల్క సుమన్ సీఎంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.