వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

హైదరాబాద్ బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది .అమ్మవారి కల్యాణానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.  ఎల్లమ్మ కల్యాణానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనమిచ్చారు.  ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ,పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా హాజరయ్యారు.

 ఎల్లమ్మ తల్లి దేవస్థానం. అమ్మవారి గర్భాలయాన్ని ప్రత్యేకంగా అలకంరించారు ఆలయ అధికారులు. అమ్మవారి మూలవిరాట్ కు బంగారు చీరతో అలంకరణ చేశారు. ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారికి 27 చీరలు,స్వామి వారికి 11 పంచెలతో . రంగు రంగుల పూలతో అమ్మవారి ప్రధాన ఆలయం, పరిసరాలను తీర్చిదిద్దారు సిబ్బంది.  

 అమ్మవారి మూలవిరాట్ కు బంగారు చీరతో అలంకరణ చేశారు. ఆలయంలో ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమచ్చారు. రంగు రంగు పూలతో అమ్మవారి ప్రధాన ఆలయం, పరిసరాలను తీర్చిదిద్దారు సిబ్బంది. భక్తుల కోసం క్యూలైన్లు, VIP ఎంట్రీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మూడ్రోజుల కల్యాణ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు పెళ్లి  కల్యాణ మహోత్సవం జరిగింది.

జూలై 10న  ఉదయం 5 గంటలకు నాదస్వర మంగళ వాయిద్యములు, అభిషేకం నిర్వహిస్తారు. దేవతాపూజలు, అగ్రి ప్రతిష్ఠ గణపతిహోమము, మహా శాంతి హోమం, బలిహరణం, పూర్ణాహుతి ఉంటాయి. అలాగే రాత్రి ఆరు గంటల నుంచి అమ్మవారి రథోత్సవం జరుగనుంది. దీంతో కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పద్మశ్రీ టవర్స్ నుంచి ఆర్ అండ్ బి వరకు అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్, SRనగర్ కమ్యూనిటీ హాల్, టెంపుల్ వెనుక ప్రాంతాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు.