బాల్కొండ, వెలుగు: కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కార్యకర్తల ద్వారా ప్రతీ ఇంటికి తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానని బాల్కొండ కాంగ్రెస్అభ్యర్థి ముత్యాల సునీల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మానాల, దేవగాతండా, అడ్డబార్ తండా, ఈదైడి తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనులందరికీ పోడు పట్టాలు ఇస్తామన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వారికి తోడ్పాటునందిస్తామన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 వంట గ్యాస్‌సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌలత్కల్పిస్తామన్నారు. పంట పెట్టుబడి సహాయంగా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఒక్కసారి అవకాశమిచ్చి తనను గెలిపించాలన్నారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మనోహర్‌రెడ్డి, నిఖిల్, గంగారెడ్డి, రెంజర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు బాస మల్లేశ్, దాసు, గంగాధర్, శేఖర్, వేల్పూర్ మండలానికి చెందిన సచిన్, రమేశ్, శశాంక్, నవనీత్ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.