న్యూఢిల్లీ : కొత్త తరం బాలిస్టిక్ మిసైల్ ‘అగ్ని ప్రైమ్’ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌లో బుధవారం రాత్రి డీఆర్డీవో ఈ పరీక్ష నిర్వహించింది. అనుకున్న లక్ష్యాలను మిసైల్ నెరవేర్చిందని అధికారులు తెలిపారు. మిసైల్ పరీక్ష సమయంలో రాడార్, టెలిమెట్రీ, ఎలెక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ను వివిధ లొకేషన్లలో పంపామని చెప్పారు.
మిసైల్ గమనాన్ని, డేటాను ట్రాక్ చేయడానికి టర్మినల్ పాయింట్లో 2 డౌన్ రేంజ్ షిప్స్‌ను ఉపయోగించామ ని వివరించారు. డీఆర్డీవో, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అధికారుల సమక్షం లో ఈ పరీక్ష నిర్వహించామని ఇస్రో అధికారులు వెల్లడించారు.