![ఇంటికో ఉద్యోగమని చెప్పి మోసం చేసిన్రు](https://static.v6velugu.com/uploads/2023/06/balmuri-venkat-critisized-cm-kcr-on-youth-employement_OjsdSoKqCm.jpg)
- ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్
ములుగు, వెలుగు : ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. బుధవారం ములుగులో స్టూడెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ నాలుగేండ్లు గడుస్తున్నా నిరుద్యోగభృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని, కుటుంబ పాలన సాగిస్తూ స్టూడెంట్ల పాలిట శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను పెంచేందుకే క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 18న పోటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్, జిల్లా ఇన్‌చార్జులు ఫరాజ్, అహ్మద్, ఎంపీటీసీ మావురపు తిరుపతిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు జక్కుల రేవంత్ యాదవ్, మురకుట్ల నరేందర్, గొర్రె రాహుల్ పాల్గొన్నారు.