
ముషీరాబాద్, వెలుగు: పిల్లల్లో సృజనాత్మకత, విలువలు, ఆత్మగౌరవం పెంపొందించేలా, అనుభవ పూర్వక జ్ఞానాన్ని అందించేలా మే 5 నుంచి 22 వరకు తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎన్.సోమన్న తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమ్మర్ క్యాంప్ ఉంటుందన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో క్యాంప్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు.
మహనీయులు, త్యాగధనుల స్ఫూర్తి నింపడం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే సమ్మర్ క్యాంప్ లక్ష్యమన్నారు. ఆసక్తిగా ఉన్నవారు ఈ నెల 15 నుంచి 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94900 94676/94900 98343లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కవయిత్రి సుజావతి, రూప రుక్మిణి, బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.