ఎక్కువ తక్కువ మాట్లాడకు..అభివృద్ధి మీద చర్చకు రా..!: బలరాంనాయక్​

కొత్తగూడ,వెలుగు : ‘ఖబడ్దార్​...ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావ్...నీకు మంచిది కాదు’ అంటూ మహబూబాబాద్ ఎంపీ కవితపై కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ​ఫైర్​ అయ్యారు. బుధవారం మహబూబాబాద్ ​జిల్లా కొత్తగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం కురవిలో ఎంపీ కవిత తనపై చేసిన అరోపణలను ఖండించారు. 

మహబూబాబాద్​ పార్లమెంట్​పరిధిలో తాను చేసిన అభివృద్ధే తప్పించి కవిత చేసిందేమిటో తేల్చేందుకు చర్చకు రావాలని సవాల్​ విసిరారు. వెంట పీసీసీ స్టేట్​అర్గనైజింగ్​ సెక్రెటరీ చల్లా నారాయణ రెడ్డి, ఎంపీపీ విజయ రూప్​సింగ్, మండల పార్టీ అధ్యక్షుడు వజ్జ సారయ్య, లీడర్లు బిట్ల శ్రీనివాస్​, సుభాష్​ రెడ్డి, సంజీవ రెడ్డి, బిక్షపతి, ప్రశాంత్​ ఉన్నారు.