
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నుంచి రాబోతున్న సినిమా ‘సికందర్’. తమిళ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కాజల్ అగర్వాల్ కీలకపాత్ర పోషిస్తుండగా, సత్యరాజ్ విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, జోహ్రా జబీన్ పాటతో అంచనాలు పెంచిన మేకర్స్.. మంగళవారం హోలీ నేపథ్యంలో వచ్చే పాటను విడుదల చేశారు.
‘భం భం భోలే’ అంటూ సాగే ఈ పాటలో సల్మాన్ డ్యాన్సులు, రష్మికతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఇంప్రెస్ చేశాయి. కనిపించింది కాసేపే అయినా కాజల్ అగర్వాల్ ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. హోలీ గొప్పతనాన్ని తెలియజేస్తూ సాగిన లిరిక్స్, రంగుల పండుగ నేపథ్యంలో సాగిన చిత్రీకరణ ఆకట్టుకుంది. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం రంజాన్ సందర్భంగా మార్చి నెలాఖరులో విడుదల కానుంది.