6.18లక్షల ఎకరాల్లో వెదురు సాగు లక్ష్యం : కలెక్టర్​ జితేశ్ వి పాటిల్

6.18లక్షల ఎకరాల్లో వెదురు సాగు లక్ష్యం : కలెక్టర్​ జితేశ్ వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 6.18లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించినట్టు కలెక్టర్​ జితేశ్​​ వి పాటిల్​ పేర్కొన్నారు. కలెక్టరేట్​లో ఇండస్ట్రీ క్రాఫ్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పలు శాఖల ఆఫీసర్లతో సోమవారం నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. వెదురు సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయన్నారు. సులభ పద్ధతుల్లో వెదురు సాగు చేయడం, వెదురు వల్ల కలిగే  లాభాలపై రెండు రోజుల పాటు ఇస్తున్న ట్రైనింగ్​ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మునగ, వెదురు సాగుతో రైతుల ఇంట సిరులు పంట పండినట్టే నన్నారు. 

థర్మల్​ విద్యుత్​ కేంద్రాల్లో బొగ్గు వినియోగంతో ఎక్కువ కాలుష్యం ఏర్పడుతొందన్నారు. వెదురుతో తయారు చేసిన గుళికలు వినియోగించడం ద్వారా వాయు కాలుష్యం ఉండదన్నారు.  చంద్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాల్లోని భూములు వెదురు సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, హార్టికల్చర్​ ఆఫీసర్​ కిశోర్​, ఫౌండేషన్​ ప్రోగ్రాం మేనేజర్​ రమ్య, డాక్టర్​ శ్రీకాంత్​, అమృత, అక్షయ్​, కుసుమ కుమారి పాల్గొన్నారు.