31 వరకు డ్రోన్లపై నిషేధం

కరీంనగర్ క్రైం,వెలుగు:  భద్రతా కారణాల దృష్ట్యా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని ఈ నెల 31 వరకు నిషేధిస్తున్నట్లు సీపీ ఎల్‌‌.సుబ్బరాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు డ్రోన్లను వినియోగించే అవకాశాలుండటంతో వాటిని నిషేధం విధించినట్లు తెలిపారు.

ఎవరైనా వినియోగించాలని అనుకుంటే  పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు.  నిబంధనలను ఉల్లంఘిస్తే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.