కేసీఆర్​ ప్రచారంపై నిషేధం కుట్రలో భాగమే : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : మోదీ, రేవంత్ కుట్రలో భాగంగానే మాజీ సీఎం, బీఆర్​ఎస్​ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం సూర్యాపేటలో మీడియాతో జగదీశ్​రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ విద్వేష ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఎలక్షన్​ కమిషన్​కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రతో సీఎం రేవంత్​రెడ్డితో పాటు ప్రధాని మోదీకి వణుకు మొదలైందన్నారు. వీధి రౌడీగా 

మాట్లాడిన రేవంత్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతుంటే మాజీ సీఎం కేసీఆర్ ను మాత్రం ఇంటికి పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని నిషేధాలు పెట్టినా ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓటుకి నోటు కేసు ఇక్కడ విచారిస్తే ప్రభావితం చేస్తారని అనుమానం తమకు ఉందని, అందుకే వేరే రాష్ట్రంలోకి మార్చాలని కోరినట్లు చెప్పారు. కోర్టు నుంచి సరైన తీర్పు వస్తుందని  ఆశిస్తున్నామన్నారు.