అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిషేధం

అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిషేధం
  • అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిషేధం
  • ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్

హైదరాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో జులై 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు అటవీ శాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈలుసింగ్ మీరూ తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, మల్టీ లేయర్ ప్లాస్టిక్, వాటర్ బాటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి వాటిపై నిషేధం ఉంటుందని చెప్పారు. ఈ మేరకు గురువారం ఈలుసింగ్ మీరూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుమతించబోమని.. సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యాటకుల కోసం నీటి సమస్యలు తలెత్తకుండా, అవసరమైన ప్రదేశాలలో మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సందర్శకులు తమవెంట తీసుకువచ్చే ఆహార పదార్థాల వ్యర్థాలను నిర్దేశించిన స్థలలో ఏర్పాటు చేసిన చెత్త కుండీలల్లోనే వేయాలని సూచించారు.