అండర్ 19 ప్రపంచ కప్ 2024లో భాగంగా శనివారం(జనవరి 20) భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును ఓపెనర్ ఆదర్శ్ సింగ్(76; 96 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్ ఉదయ్ సహారన్(64; 94 బంతుల్లో 4 ఫోర్లు) ఆదుకున్నారు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఆర్షిన్ కులకర్ణి(7) పరుగులకే వెనుదిరిగాడు. ఆపై కొద్దిసేపటికే ముషీర్ ఖాన్(3) కూడా ఔటయ్యాడు. దీంతో టీమిండియా 31 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ఆదర్శ్ సింగ్(76)- ఉదయ్ సహారన్(64) జోడి ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 116 పరుగులు జోడించారు. చివరలో ఆరవెల్లి అవనీష్(23; 17 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్), సచిన్ దాస్(26; 20 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) విలువైన పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో మరుఫ్ మృధా 5 వికెట్లతో చెలరేగాడు.
Also Read : పాకిస్తాన్ క్రికెట్‍లో ముసలం.. ఛైర్మన్ పదవికి జకా అష్రఫ్ రాజీనామా
Innings break!#TeamIndia set a ? of
— BCCI (@BCCI) January 20, 2024
2️⃣5️⃣2️⃣ ????
Fifties from Adarsh Singh and Captain Uday Saharan ????
Scorecard ▶️ https://t.co/DFqdZaYujm#BoysInBlue | #U19WorldCup | #BANvIND pic.twitter.com/RV1MErr22E