ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న కీలక పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో అఫ్ఘాన్ బౌలింగ్ చేయనుంది. ఆసియా కప్‌లో ముందుకెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే.
శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో బంగ్లా ఓడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో మినహా మిగిలిన వారందరూ ఫెయిలయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో బంగ్లా పూర్తిగా బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెట్టనుంది. అనుభవజ్ఞుడైన కెప్టెన్ షకీబ్ పెర్ఫామెన్స్ ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకం కానుంది.
తుది జట్లు
బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షమీమ్ హొస్సేన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్.
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, ముజీబ్ ఉర్ రహ్మాన్.
Asia Cup 2023: Bangladesh Vs Afghanistan ?
— Bangladesh Cricket (@BCBtigers) September 3, 2023
Bangladesh won the toss and decided to bat first ?#BCB | #AsiaCup | #BANvAFG pic.twitter.com/bAwsMV2w2Y