లెక్క తప్పిన అంపైర్.. ఓవర్‌కు ఎన్ని బాల్స్ వేయించాడంటే?

లెక్క తప్పిన అంపైర్.. ఓవర్‌కు ఎన్ని బాల్స్ వేయించాడంటే?

ఆర్యన్ రాజేష్, నమిత జంటగా నటించిన సొంతం సినిమా అందరకీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం కథ పక్కనపెడితే, సునీల్ పండించిన కామెడీ మాత్రం సూపర్బ్. ఎన్ని సార్లూ చూసినా కడుపుబ్బా నవ్వుకునే చిత్రమిదే. ఇందులో ఒక సీన్‌లో సునీల్.. కళ్లు కనిపించని వారిని ఏం చేస్తారు..? అన్న దానికి అంపైర్లని చేస్తారు అంటూ సమాధానమిస్తాడు. ఇది వారిని హేళన చేసేదే అయినా.. అలా ఎందుకు చెప్పాడో.. ఈ అంపైర్‌ను చూస్తే అర్థమవుతుంది.

Also Read : IND vs AUS: పసలేని ఆసీస్ బౌలింగ్.. గిల్, అయ్యర్ సెంచరీలు

బౌలర్.. బంతులు వేస్తూనే ఉన్నాడు.. అంపైర్ చూస్తూనే ఉన్నాడు. ఈ ఘటన బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో చోటు చేసుకుంది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా..? అంపైర్ బంతులు లెక్కపెట్టడం మార్చుపోయాడు కనుక.

ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షర్ఫుద్దోలా ఒకానొక సమయంలో గాడితప్పాడు. మ్యాచ్‌లో ఎక్కువ లీనమైపోయి బంతులు లెక్కపెట్టడం మర్చిపోయాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ 47వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. అంపైర్ తప్పిదం వల్ల బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ ఆ ఓవర్‌లో ఏడు బంతులు వేశాడు. అయితే ఆ బంతి డాట్ అవ్వడంతో ఇరు జట్లకు ఎలాంటి నష్టం జరగలేదు. వికెట్ పడినా.. సిక్సర్ కొట్టినా పరిస్థితి మరోలా ఉండేది. అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ ఇలా లెక్క తప్పడంపై క్రికెట్ ఫ్యాన్స్ జోకులు పేలుస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో కివీస్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ 49.2 ఓవర్లలో 255 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు 168 పరుగులకే కుప్పకూలారు.