BAN vs PAK: భళా బంగ్లా.. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై 10 వికెట్లతో చారిత్రక విజయం

  • టెస్టు ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌పై మొదటి గెలుపు
  • పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఆడిన 14 టెస్టుల్లో బంగ్లాకు ఇదే తొలి విజయం.
  • విదేశీ గడ్డపై బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు ఇది ఏడో టెస్టు విజయం. చివరగా గతేడాది జనవరిలో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. 7
  • 9 సొంతగడ్డపై ఆడిన గత 9 టెస్టుల్లో పాక్ విజయం సాధించలేక పోయింది. చివరగా 2021లో సౌతాఫ్రికాపై నెగ్గింది.

రావల్పిండి: రాజకీయ అనిశ్చితితో తమ దేశం రగిలిపోతున్న వేళ.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలి టెస్టులో ఆతిథ్య పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.  టెస్టు ఫార్మాట్‌‌పై పాక్‌‌పై తొలిసారి గెలిచిన బంగ్లా టైగర్స్ చారిత్రక విజయం సొంతం చేసుకున్నారు. డ్రా పక్కా అనుకున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో చివరి రోజు స్పిన్నర్లు మెహిదీ హసన్ మిరాజ్‌‌‌‌‌‌‌‌ (4/21), షకీబ్ అల్ హసన్‌‌‌‌‌‌‌‌ (3/44) మ్యాజిక్ చేశారు. ఈ ఇద్దరు  కలిసి ఏడు వికెట్లు పడగొట్టి పాక్‌‌కు షాకిచ్చారు.  చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నా అతి విశ్వాసంతో  తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను డిక్లేర్ చేసిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో పేకమేడలా కూలి ఘోర ఓటమి ఖాతాలో వేసుకుంది. 

మిరాజ్‌‌‌‌‌‌‌‌, షకీబ్ దెబ్బకు ఆఖరి రోజు, ఆదివారం పాక్‌‌‌‌‌‌‌‌ 146 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటై.. బంగ్లాకు 30 రన్స్ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను మాత్రమే ఇచ్చింది. మహ్మద్ రిజ్వాన్ (51), అబ్దుల్లా షఫీక్ (37), బాబర్ ఆజమ్ (22) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. అనంతరం బంగ్లా 6.3 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా 30 రన్స్ చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్లు జాకీర్ హసన్ (15 నాటౌట్‌‌‌‌‌‌‌‌), షాడ్మన్ ఇస్లాం (9 నాటౌట్) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను  పాక్‌‌‌‌‌‌‌‌ 448/6  స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. బంగ్లా 565 రన్స్‌‌కు ఆలౌటైంది. భారీ సెంచరీ చేసిన  ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది. రెండు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ 

ఇదే వేదికపై 30 నుంచి జరుగుతుంది.

మెహిదీ, షకీబ్ స్పిన్ మ్యాజిక్

తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా117 రన్స్ ఆధిక్యం దక్కించుకున్నప్పటికీ.. నాలుగు రోజుల్లో  ఇరు జట్లూ చెరో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను మాత్రమే పూర్తి చేయడంతో  అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫలితం రాదనిపించింది. ఆఖరి రోజు బంగ్లా నిజంగానే మ్యాజిక్ చేసింది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 23/1తో ఆట కొనసాగించిన పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను తమ బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆట మొదలైన రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే పాక్‌‌‌‌‌‌‌‌ను వణికించింది. కీపర్ క్యాచ్‌‌‌‌‌‌‌‌తో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ షాన్‌‌‌‌‌‌‌‌ మసూద్‌‌‌‌‌‌‌‌ (14)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన హసన్ మహ్మూద్ ఆ జట్టు పతనాన్ని ఆరంభించాడు. మరో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్ షఫీక్‌‌తో కలిసి  బాబర్  మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు38 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ, నహిద్ రాణా ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిచ్ బాల్‌‌‌‌‌‌‌‌ను  వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డ్ అయ్యాడు. తర్వాతి ఓవర్లోనే సౌద్ షకీల్ (0)ను  స్టంపౌట్‌‌‌‌‌‌‌‌ చేసిన షకీబ్‌‌‌‌‌‌‌‌.. కాసేపటికే షఫీక్‌‌‌‌‌‌‌‌ను కూడా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చి పాక్‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టాడు. 

ఇక్కడి నుంచి మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ జోరు మొదలైంది. తర్వాతి ఓవర్లోనే అఘా (0)ను  అతనుగోల్డెన్ డకౌట్ చేయడంతో  పాక్‌‌‌‌‌‌‌‌ 105/తో కష్టాల్లో పడింది.  ఓవైపు రిజ్వాన్ క్రీజులో పాతుకుపోయినా అతనికి సహకారం లభించలేదు.  షాహీన్‌‌‌‌‌‌‌‌ షా ఆఫ్రిది (2)ని మెహిదీ ఎల్బీ చేయగా.. నసీమ్‌‌‌‌‌‌‌‌ షా (3)ను షకీబ్‌‌‌‌‌‌‌‌ ఎనిమిదో వికెట్‌‌‌‌‌‌‌‌గా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. ఒంటరి పోరాటం చేస్తున్న రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ను ఫ్లయిటెడ్‌‌‌‌‌‌‌‌ డెలివరీతో బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసిన మిరాజ్‌‌‌‌‌‌‌‌ తన తర్వాతి ఓవర్లోనే మొహమ్మద్ అలీ (0) వికెట్ కూడా పడగొట్టి పాక్‌‌‌‌‌‌‌‌ను ఆలౌట్‌‌‌‌‌‌‌‌ చేశాడు.  తర్వాత చిన్న టార్గెట్‌‌ను ఈజీగా ఛేజ్ చేసిన బంగ్లా.. సొంతగడ్డపై పాకిస్తాన్‌‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 

సంక్షిప్త స్కోర్లు

  • పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 448/6 డిక్లేర్డ్‌‌‌‌‌‌‌‌; 
  • బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 565 ఆలౌట్‌‌‌‌‌‌‌‌; 
  • పాక్ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 55.5 ఓవర్లలో 146 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (రిజ్వాన్ 51, మిరాజ్ 4/21, షకీబ్ 3/44);  
  • బంగ్లా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ (టార్గెట్‌‌‌‌‌‌‌‌ 30):  6.3 ఓవర్లలో 30/0 (జాకీర్ 15*, షాడ్మన్ 9*)