మీర్పూర్ : బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య సోమవారం మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు బౌలర్ల హవా నడిచింది. ఒక్క రోజే 16 వికెట్లు పడగా సౌతాఫ్రికా పైచేయి సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఆతిథ్య బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 40.1 ఓవర్లలో 106 రన్స్‌కే ఆలౌటైంది. ఓపెనన్ మహ్ముదుల్ హసన్ జాయ్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడ, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా తొలి రోజు చివరకు 41 ఓవర్లలో 140/6 స్కోరుతో నిలిచింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (6) నిరాశ పరచగా.. టోనీ డెజార్జీ (30), ర్యాన్ రికెల్టన్ (27), ట్రిస్టాన్ స్టబ్స్ (23) కాసేపు పోరాడారు. ప్రస్తుతం కైల్ వెరెన్ (18 బ్యాటింగ్), ముల్డర్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు పడగొట్టాడు.