Agricultural: అరటి సాగు... తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..

Agricultural:  అరటి సాగు... తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..

అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో తమిళనాడు మరియు మహారాష్ట ఉత్పాదకతలో ముందుస్థానంలో ఉన్నాయి. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 75 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ, మామిడి, నిమ్మ జాతుల తరువాత మూడవ స్థానాన్ని ఆక్రమించింది. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలలోనూ అరటి సాగులో ఉన్నప్పటికీ ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ,వరంగల్‌ జిల్లాల్లో అధికంగా సాగుచేయబడుతుంది.

 అరటి ఉష్ణ మండల పంట. దీని సాగుకు కావలసిన ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీలు . అవసరమవుతుంది. దీని సాగుకు సారవంతమైన అధిక సేంద్రీయ పదార్థాలు మరియు మురుగు నీటి వసతి కలిగి ఉదజని సూచిక 6 నుండి 7 వరకు గల నేలలు అనుకూలంగా ఉంటాయి. అరటి సాగుకు అనువైన రకాలు 70 దాకా ఉన్నాయి. వీటిలో 10నుంచి 12 రకాలను తెలుగు రాష్ట్రాల్లో  విస్తృతంగా సాగుచేస్తారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న అరటి పంటను  చీడ పీడలు ఆశించి పంటను నష్టపరుస్తాయి. అందులో ముఖ్యంగా పంటను బాగా నష్టపరిచే పురుగులలో నులి పురుగులు ప్రధానమైనవి.

అరటి పంటను  నాలుగు రకాల నులి పురుగులు (రూట్‌ నాట్‌ నెమటోడు, బర్రోయింగ్‌ నెమటోడు, రూట్‌ లిజన్‌ నెమటోడు, స్పైరల్‌ నెమటోడు) ఆశించి పంటను నష్టపరుస్థాయి. అరటి రకాలైన గ్రాండ్‌ నైన్‌, రాస్తాలి, వామనకేళి, నెండ్రాన్‌, పూవన్‌, పెద్దపచ్చ అరటిలలో నులి పురుగులు ఉధృతి అధికంగా ఉంటుంది. ఇవి ప్రధానంగా వేర్ల ద్వారా దుంపలలోకి చేరి దుంప కణజాలాన్ని ఆశించి కూలిపోయేటట్లు చేస్తుంది.

రూట్‌ నాట్‌ నెమటోడు : అరటి పండించే తేలికపాటి నేల్లలో మరియు అధిక నీటి యద్దడి గల ప్రాంతాలలో దీని ఉధృతి అధికంగా ఉంటుంది. నెమటోడు మొక్కలను ఆశించడం వల్లన అనేక విధాలుగా నష్టం కనపడుతుంది.

లక్షణాలు : ఎదుగుదల మందగిస్తుంది. మొదట ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోవడం ఆకుల ఆకృతి మారిపోవడం జరుగుతుంది.

నష్టపరచే విధానం : ఆడ పురుగులు సుమారు 200 నుండి 300 వరకు గుడ్లు పెడతాయి. నులి పురుగులు వేర్లలోకి ప్రవేశించి రసం పీల్చి, వేర్లపై చారలు ఏర్పరుస్తాయి. మరికొన్ని రకాల నులి పురుగులు ఆశించడం వలన వేర్లపై కాయలవంటి బుడిపెలను ఏర్పరుస్తాయి. నులి పురుగులు ఆశించడం వలన వేర్లు ... దుంప బలహీనపడి మొక్క ... నీటిని పోషకాలను సరిగా తీసుకోలేదు. అందువలన మొక్కలు వదలిపోయినట్లు కన్పిస్తాయి.

బర్రోయింగ్‌ నెమటోడు : వేర్ల లోపల చారలు ఏర్పడి నిర్వీర్యం చేస్తుంది. వేరు అంతర్గత కణజాలాల క్షీణతకు కారణమవుతాయి. నులి పురుగులు ఆశించిన మొక్కలను భూమి నుండి సులభంగా బయటకు తీసివేయవచ్చు. ఈ నులిపరుగు దాడిచేయడం వలన చిన్నపాటి గాలి వానకు  కూడా మొక్క క్రిందకు పడిపోతుంది. తరువాత ఇది బాక్టీరియా, ఫంగస్​ ,  వైరస్‌ తెగుళ్ళ వ్యాప్తికి దోహదపడుతాయి.

రూట్‌ లిజన్‌ నెమటోడు : దీని ఉధృతి అక్టోబర్‌-డిసెంబర్‌ మాసాలల్లో అధికంగాఉన్నా..  మార్చి నుండి ఆగష్టు వరకు వ్యాప్తిస్తుంది. ప్రారంభ దశలో మొక్క వేర్లపై దీర్గవృతాకార వలయాలను ఏర్పరుసాయి. ఈ వలయాలు పసుపు... గోధుమ ...  నలుపు రంగులో ఉండి తర్వాత మొక్క చిన్నగా ఉంటూ పసుపు రగులోకి మారి చనిపోవడం జరుగుతుంది.

స్పైరల్‌ నెమటోడు : ఈ నులి పురుగులు ఆశించునటువంటి మొక్కలు కాండం క్షీణించి మొక్కలలో ఎలాంటి పెరుగుదల కనిపించదు. అన్ని రకాల నేలల్లో (తేలికపాటి మరియు బరువైన నేలల్లో) నివశిస్తుంటాయి. మొక్క వేర్ల లోపాల చూసినప్పుడు గోధుమ రంగు వలయాలు కనిపిస్తాయి. స్పైరల్‌ నెమటోడు ఆశించడం వలన 33శాతం దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది.

యాజమాన్య పద్ధతులు 

 

  • నులి పురుగులు సోకనటువంటి తోటల నుండి పిలకలు సేకరించాలి.
  • పిలకల దుంపపై చర్మం పలుచగా చెక్కి తరువాత క్లోరిపైరిఫాస్‌ 25 శాతం ఇ సి ఏ 2 మి.లీ లేదా కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 5 గ్రా. కలిపిన ద్రావణంలో ముంచి నీటిలో ఆరనిచ్చి తరువాత నాటుకోవాలి.
  •  లోతుగా దుక్కిచేసి బాగా ఎండగాచిన నెలలో అరటిని పాతుకోవాలి.
  • పంట మార్పిడి చేయాలి. నేలలో వేర్లపై చారలు కలుగుచేసే నులి పురుగులవ్యాప్తిని తగ్గించేందుకు  జనుము పంట పెంచి పూ మొగ్గ దశలో నేలలో కలియ దున్ని ఆ తరువాత అరటిని నాటుకోవాలి.
  • నులి పురుగులు సోకిన అరటి తోటల్లో మొక్కకు 25 గ్రాముల నుంచి  40 గ్రాముల  కార్బోఫ్యూరాన్‌ గుళికలను మొక్క మొదలు వద్ద 10 సెం . మీ. లోతులో వేసి మట్టితో కప్పి తేలికగా నీరు పెట్టాలి.
  • పొగాకు, బెండ, టమాటా మొదలగు పంటలతో పంట మార్పిడి చేయరాదు.ఈ నేలలో బంతి పంటను పండించిన తరువాత అరటిని నాటుకోవడం ద్వారా రూట్‌ నాట్‌ నెమటోడు తగ్గించవచ్చు.
  •  పిలకలను నాటేటప్పుడు, నాటే గుంతలో అర కిలో వేప పిండి లేదా 5 కిలోల పశువుల ఎరువు వేస్తే నులిపురుగులు  వృద్ధి కాకుండా అదుపులో ఉంటాయి.
  • డ్రిప్‌ నీటిపారుదల సౌకర్యమువున్న తోటలకు ద్రవరూపంలో ఉన్న సుడోమొనాస్‌ ప్లోరోసెన్స్‌ జీవ సంబంధ మందును ఎకరానికి 1.6 లీటర్లను నీటిలో కలిపి తోట నాటిన తర్వాత రెండవ, నాల్గవ, ఆరవ మాసాలకు డ్రిప్‌ నీటి ద్వారా అన్ని మొక్కలకు అందించడం వలన చాలా వరకు నులి పురుగులు తగ్గించవచ్చు.
  • అరటిలో వరి పంట మార్పిడి చేస్తే నులిపురుగులేకాక వాడు తెగుళ్ళు రాదు.
  • ఫ్లూయోరం 34.48శాతం  ఇ సి ఏ 500 మీ.లీ / ఎకరానికి డ్రిప్‌ ద్వారా పంపించడం వల్ల నులి పురుగులను అరికట్టవచ్చు.
  • ఇలాడ సమగ్ర చర్యలను పాటించడం వలన నులి పురుగుల బెడద నుండి అరటి పంటను కాపాడుకొని అధిక దిగుబడిని సాధించండి.