ముదిరాజ్​ల అభ్యున్నతికి కృషి : బండ ప్రకాశ్

కామారెడ్డి, వెలుగు: ముదిరాజ్​ల అభ్యున్నతికి కేసీఆర్​కృషిచేస్తున్నారని ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్​ బండ ప్రకాశ్ ​ముదిరాజ్​ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కామారెడ్డిలో ముదిరాజ్ ​ముఖ్య నేతలతో సమవేశమయ్యారు.  ప్రకాశ్ ​మాట్లాడుతూ..  ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ముదిరాజ్​లు కీలకంగా పని చేశారన్నారు. కేసీఆర్​కు ముదిరాజ్​లపై ప్రేమ ఉందన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ముదిరాజ్​ల ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ఫిషరీస్​​ కార్పొరేషన్​పదవిని మొదటిసారి ముదిరాజ్​ సామాజిక వర్గానికే ఇచ్చారన్నారు.  ముదిరాజ్​మహాసభ స్టేట్ ప్రతినిధి పున్న రాజేశ్వర్​ మాట్లాడుతూ.. ముదిరాజ్​ల సమస్యలు పరిష్కరిస్తానని కేటీఆర్ ​చెప్పారన్నారు.   ప్రతినిధులు శ్రీనివాస్​, జగన్, నంద రమేశ్, లక్ష్మీనారాయణ, కాళ్ల గణేశ్, వేణు పాల్గొన్నారు.

​భిక్కనూరు: రిటైర్డ్​పబ్లిక్​ ప్రాసిక్యూటర్ ​గజ్జెల భిక్షపతి తల్లి మల్లవ్వ అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాశ్ శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.