
పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పీఎస్ ఇన్ స్పెక్టర్ గా బండారి శోభన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కేసు విషయంలో.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా పంజాగుట్ట పీఎస్‌కు ఇన్ స్పెక్టర్ గా నియామకమైన బండారి శోభన్ గురువారం బాధ్యతలు చేపట్టారు.
2007 బ్యాచ్‌కు చెందిన శోభన్ 2014 వరకు సైబరాబాద్ కమిషరేట్‌లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత నిజామాబాద్‌కు బదిలీపై వెళ్లారు. 2020లో 317 జీవో కారణంగా తిరిగి హైదరాబాద్‌కు బదిలీపై వచ్చారు.2022 నుంచి 2023 వరకు ఏడాది పాటు యూఎన్ పీస్ మిషన్‌లో భాగంగా ఆఫ్రికాలో విధులు నిర్వహించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సిటీ కమిషరేట్‌లో పనిచేస్తున్న శోభన్.. పంజాగుట్ట పీఎస్‌కు ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చారు. గురువారం బాధ్యతలు చేపట్టారు.