మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నరసింహారావు

మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నరసింహారావు

మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​గా ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్​ బండారు నరసింహారావు, వైస్ చైర్మన్ గా మధిర మండలం వంగవీడుకు చెందిన అయిలూరి సత్యనారాయణ రెడ్డిని నియమించారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో మార్కెటింగ్​ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా అద్దంకి రవికుమార్, వేల్పుల చెంచయ్య, బాణావత్ వెంకటరమణ, షేక్ షన్ను, తూములూరి నాగేశ్వరరావు,  వంగాల రామారావు,  వట్టి కొండ రామకృష్ణ, బొంతు నారాయణ గౌడ్, అనుమోలు వెంకటేశ్,  గుడేటి బాబురావు,  యన్నం పిచ్చిరెడ్డి,  వేమిరెడ్డి అనురాధను  నియమించారు.