ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇయ్యాల బంద్

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇయ్యాల బంద్

ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం దేశ వ్యాప్తంగా బంద్​పాటించాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వైస్​చైర్మన్ జి.చెన్నయ్య మాల సంఘాలు, నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా బంద్​పాటించాలని కోరారు.

ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు చేస్తున్న బంద్​లో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొవాలని చెన్నయ్య కోరారు. ప్రభుత్వ ఆస్తులు, ఇతర ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా బంద్​జరగాలన్నారు.