నీట్‌ లీకేజీని నిరసిస్తూ జులై 4న విద్యాసంస్థల బంద్‌

నీట్‌ లీకేజీని నిరసిస్తూ  జులై 4న విద్యాసంస్థల బంద్‌

2024 జైలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. ఎల్బీజీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ వినోద్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రాజశేఖర్‌ వివరాలు వెల్లడించారు. బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరారు.  కేంద్రం నిర్వాకం వలన లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని, ఐఐటి ప్రవేశాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలని, యూనివర్సిటీల్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని, విద్యార్థులు, విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని కోరుతూ బంద్‌ చేస్తున్నామన్నారు.