బంధన్​ నుంచి ఈక్వల్ కాలిక్యులేటర్

బంధన్​ నుంచి ఈక్వల్ కాలిక్యులేటర్

హైదరాబాద్​, వెలుగు: మ్యూచువల్​ ఫండ్​ కస్టమర్ల కోసం బంధన్ మ్యూచువల్ ఫండ్ ఈక్వల్ కాలిక్యులేటర్​ను తీసుకొచ్చింది. ఇది వివిధ ఫండ్ల పని తీరును పోల్చడానికి సహాయపడుతుంది. పెట్టుబడిదారులు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో,  వారి ఆర్థిక లక్ష్యాల కోసం ప్లాన్లు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది.  దీంతో వాస్తవిక పెట్టుబడి లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చని బంధన్​ తెలిపింది.  ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఎంత మొత్తం ఇన్వెస్ట్​చేయాలో తెలియజేస్తుంది. మాన్యువల్  లెక్కల అవసరాన్ని తొలగించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.  పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.