సత్తుపల్లిలో ఐటీ టవర్​ నిర్మిస్తా : ​ బండి పార్థసారథి రెడ్డి

సత్తుపల్లి, వెలుగు  : ఎమ్మెల్యే సండ్రకు అండగా  తానున్నానని, సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు లభించకపోతే తన సొంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తానని ఎంపీ, హెటిరో డ్రగ్స్  అధినేత డాక్టర్​ బండి పార్థసారథి రెడ్డి  హామీ ఇచ్చారు. సత్తుపల్లిలో మినీ ఐటీ టవర్ నిర్మిస్తానని చెప్పారు.  ఆదివారం సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాను ఉపాధి పొందుతూ పదిమందికి ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు ప్రారంభించానన్నారు. ప్రభుత్వం స్థలమిస్తే కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపడతానని, ఇప్పటికే రూ.4 కోట్లతో సత్తుపల్లిలో లైబ్రరీ నిర్మించానని తెలిపారు. మరోసారి సండ్రను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.