ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీఆర్ఎస్ కు కీలక నేతలు దూరమవుతున్నారు. తాజాగా శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ బీఆర్ఎస్ కు గుడ్‌బై చెప్పారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఈరోజు(అక్టోబర్ 20) ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి రాహుల్ గాంధీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
శేరిలింగంపల్లి అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినట్లు సమాచారం. సిట్టింగ్ లకే మరోసారి టికెట్ అనడంతో కొంత కాలంగా బండి మౌనంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో బండి రమేష్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.