సిరిసిల్ల జిల్లా కలెక్టర్​ కు కేంద్రమంత్రి బండి సంజయ్​ ఫోన్​..ఎందుకంటే..

సిరిసిల్ల జిల్లా కలెక్టర్​ కు కేంద్రమంత్రి బండి సంజయ్​ ఫోన్​..ఎందుకంటే..

సిరిసిల్లలోని  కరీంనగర్ పాల శీతలీకరణ కేంద్రం సీజ్​చేసిన విషయం తెలిసిందే.  ఈ విషయంపై కేంద్రమంత్రి బండిసంజయ్ జిల్లా కలెక్టర్​ కు ఫోన్​ చేసి విషయాలు తెలుసుకున్నారు. ఫైర్ సేఫ్టీ సహా శీతలీకరణ కేంద్రానికి సంబంధించి సరైన అనుమతులు లేవని..అందుకే సీజ్​ చేశామని కలెక్టర్​ తెలిపారు.  

సిరిసిల్ల జిల్లాలోని వేలాది మంది రైతులు కరీంనగర్ డెయిరీకి నిత్యం పాలు సరఫరా చేస్తారని, సీజ్ చేయడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉందని ...  బండి సంజయ్ కలెక్టర్ ద్రుష్టికి తెచ్చారు. రైతుల శ్రేయస్సు ద్రుష్ట్యా శీతలీకరణ కేంద్రాన్ని  తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫైర్ సేఫ్టీసహా ఇతర అనుమతులకు సంబంధించి నిబంధనలు పాటించేలా నిర్ణీత గడువు విధించాలని సూచించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రైతుల శ్రేయస్సు ద్రుష్ట్యా సీజ్ చేసిన కరీంనగర్ పాల శీతలీకరణ కేంద్రంను తెరిపిస్తానని హామీ ఇచ్చారు.