యాదాద్రి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 9వ రోజు కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా బండి సంజయ్ కాసేపట్లో పాదయాత్ర శిబిరం వద్ద స్వతంత్ర సమర యోధుడు బత్తిని మొగులయ్య గౌడ్ కు నివాళులు అర్పించనున్నారు. అనంతరం సిరిపురం నుంచి రామన్నపేట, దుబ్బాక మీదుగా మునిపంపుల వరకు యాత్ర కొనసాగించనున్నారు.
9వ రోజు పాదయాత్ర 12.5కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టే చర్యల గురించి వారికి వివరించనున్నారు. సాయంత్రం రామన్నపేట వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్.. రాత్రికి మునిపంపుల వద్ద బస చేయనున్నారు.